వరదలు: దేవుడికి ఇంత కోపమెందుకు? జవాన్ ఆవేదన

భక్తులను కాపాడుతున్న ఓ హెలికాప్టర్ కూలిపోయింది. అందులోని ఇరవై మంది సైనికులు మృతి చెందారు. సహాయార్థం వెళ్తున్న ఓ సైనికుల హెలికాప్టర్ కూలిందనే వార్త తెలియగానే వైమానిక దళానికి చెందిన ఓ అధికారి.. దేవుడికి ఇంత కోపమెందుకని ఆవేదనతో ప్రశ్నించారు.
'దేవుడికి ఇంతగా కోపమెందుకని, ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకొని సహాయం కోసం అర్థిస్తున్న వారిని మానవత్వంతో రక్షించేందుకు వెళ్లిన వారిని కూడా ఎందుకు బలి తీసుకుంటున్నాడని బాధతో పలికారు.
మంగళవారం బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్ కూలి అందులోని ఇరవై మంది మృతి చెందారు. అందులో ముగ్గురు వైమానిక అధికారులు ఉండగా, ఎనిమిది మంది ఐటిబిటి జవాన్లు ఉన్నారు. హిమాలయాల్లో భారీగా వర్షం కురవడంతో పాటు మంచు కారణంగా ఈ ప్రమాదం సంభవించింది.












Click it and Unblock the Notifications