హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విచారణ: సొమ్మసిల్లిన శంకరన్న, కూతురు సుస్మిత లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేశ్‌ రెడ్డిలపై చేసిన ఆరోపణలకు తన వద్ద ఆధారాల్లేవని, అయినా కట్టుబడి ఉన్నానని మాజీ మంత్రి శంకర్ రావు సైఫాబాద్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఆయనను పోలీసులు బుధవారం ఐదారు గంటల పాటు విచారించారు. ఇటీవల అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ 11 ఆరోపణలతో కూడిన కరపత్రాన్ని పంచారు.

ఇందులో సిఎం, డిజిపి పైనే ఎక్కువ ఆరోపణలున్నాయి. దీనిపై డిజిపి కార్యాలయం కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతితో శంకర్ రావుపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం ఆయనను విచారించారు. డిజిపి 11 ఏళ్లుగా ఆస్తుల వివరాలు వెల్లడించలేదని, అధికారంలో ఉన్నోళ్లే అక్రమాలకు పాల్పడితే కిందిస్థాయి సిబ్బంది కూడా అలాగే ఉంటారంటూ శంకర్‌ రావు ఆరోపించారు. ఆ కరపత్రాలను తానే ముద్రించానని తెలిపారు.

తానే డిజిపిపై ఫిర్యాదు చేశానని, సమాచార హక్కు చట్టం కింద డిజిపి ఆస్తుల వివరాలు అడిగితే తనకు సమాధానం రాలేదని, ఉమేష్ కుమార్ వేసిన పిటిషన్లు, పత్రికలు, టీవీల్లో వచ్చిన వార్తలు, తనకు కొందరు నేరుగా ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆరోపణలు చేశానని వివరించారట. ఆరోపణలపై శంకర్ రావు సమాధానం సూటిగా చెప్పకపోవడంతో మరిన్ని సెక్షన్లు చేర్చేందుకు సైఫాబాద్ పోలీసులు న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది.

కాగా, విచారణ సమయంలో శంకర రావు సొమ్మసిల్లి పడిపోయారు. శంకర రావుకు బిపి పెరగడంతో వైద్యులు పరీక్షలు చేశారు. ఆయనను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు గురువారం కూడా విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

పోలీసులకు సుస్మిత లేఖ

ఈ రోజు తన తండ్రి శంకర రావు విచారణకు రాలేడని ఆయన కూతురు సుస్మిత పోలీసులకు లేఖ రాశారు. తన తండ్రి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన విచారణకు హాజరు కాలేరని, అవసరమైతే ఆసుపత్రికి వచ్చి విచారణ జరుపుకోవచ్చునని లేఖలో సుస్మిత పేర్కొన్నారు.

ఖాద్రీపై కేసు

జాతిపిత మహాత్మా గాంధీని కించపర్చేలా మాట్లాడారని మజ్లిస్ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ పైన ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పాషా ఖాద్రీపై కేసు నమోదు చేయాలని జనవరిలో రంగారెడ్డి కోర్టు పోలీసులను ఆదేశించింది.

English summary
Former Minister and Cantonment MLA Shankar Rao, responding to the notices served to him on Tuesday, presented himself at the Saifabad police station on Wednesday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X