వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరదలపై ఫైట్: హరికృష్ణ ఫైర్, దాడి చేసినా తగ్గం: లోకేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 We don't need any credit: Nara Lokesh
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ వరదల బాధితుల విషయంలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యుల మధ్య గొడవపై టిడిపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌లు స్పందించారు.

టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఆశయాల మేరకు తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం కృషి చేస్తోందని హరికృష్ణ అన్నారు. కాంగ్రెసు పార్టీ ఆలస్యంగా స్పందించడం దారుణమన్నారు. తెలుగు వారు ఎక్కడున్నా వారి బాగోగుల కోసం తాము కృషి చేస్తామని చెప్పారు.

తాము క్రెడిట్ వద్దు: నారా లోకేష్

కాంగ్రెసు పార్టీయే వరద రాజకీయాలకు పాల్పడుతోందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఉత్తరాఖండ్ వరదల బాధితుల క్రెడిట్ తమకు అవసరం లేదని లోకేష్ అన్నారు. వారు తమ పార్లమెంటు సభ్యులపై దాడి చేసినప్పటికీ బాధితులను ఆదుకోవడంలో తాము వెనక్కి తగ్గేది లేదన్నారు.

దాడి సరికాదు: చంద్రబాబు

రాష్ట్ర యాత్రికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడానికి పోటీ పడాలి కానీ, ఇలా దాడి చేయడం సరికాదని చంద్రబాబు అన్నారు. బాధితులు ఏ విమానంలో వెళ్లినా తమకు అభ్యంతరం లేదన్నారు. తమకు క్రెడిట్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు రాలేదన్నారు.

మొసలి కన్నీరు: బొత్స

చంద్రబాబు నాయుడు ఉత్తరాఖండ్ వరద బాధితుల పైన మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

English summary

 Telugudesam Party chief Nara Chandrababu Naidu's son Nara Lokesh on Wednesday said that we don't need any credit. Even if they beat us, we will keep fighting for Telugu victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X