వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు ఆదాయం కంటే ఆరోగ్యమే ముఖ్యం: షర్మిల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila
విశాఖపట్నం: తన సోదరుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్యంపై వచ్చే ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల బుధవారం అన్నారు. ఆమె పాదయాత్ర విశాఖపట్నంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె పలుచోట్ల మాట్లాడారు. కాంగ్రెసుది గాంధేయవాదం కాదని, బ్రాందేయవదామని విమర్శించారు.

రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ చేయాలని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆలోచిస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. ప్రతి మద్యం దుకాణాన్ని మినీ బార్‌లా మార్చి వ్యాపారాన్ని విస్తరించడమేమిటని ప్రశ్నించారు. అదే సమయంలో ఆరోగ్యశ్రీలో ఉన్న జబ్బులను మాత్రం కుదిస్తారట అని మండిపడ్డారు.

బెల్టు దుకాణాలకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే అన్నారు. జూన్ నెల పూర్తి కావొస్తున్నా ఈ ప్రభుత్వం రైతులకు విత్తనాలు ఇవ్వడం లేదన్నారు. విద్యార్థుల ఫీజుల భారం తగ్గించడం లేదన్నారు. మద్యం అమ్మకాల కోటా మాత్రం విపరితంగా పెంచేసిందని విమర్శించారు.

జగన్‌కు మద్యంపై వచ్చే ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్నారు. ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండటమే ఆయన ముఖ్య లక్ష్యమన్నారు.

స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని, అప్రమత్తం కావాల్సిన అవసరముందని మెదక్ జిల్లా పర్యటనలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతోందని, వారి మాయమాటలు నమ్మొద్దన్నారు. ప్రతి పంచాయతీపై పార్టీ జెండా ఎగురాలన్నారు.

English summary
YSR Congress Party leader Sharmila has blamed on Wednesday that Kiran Kumar Reddy government is changing YSR's Harita Pradesh to Madyandhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X