చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దూకి మహిళా టెక్కీ ఆత్మహత్య: ప్రేమ వ్యవహారమే?

By Pratap
|
Google Oneindia TeluguNews

Woman techie jumps from seventh floor to death in Chennai
చెన్నై: భవనం నుంచి దూకి మరో మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని నవలూరులో గల పోలారిస్ సాఫ్ట్‌వేర్ ల్యాబ్ లిమిటెడ్ కార్యాలయం భవనం ఏడో అంతస్థు నుంచి కిందికి దూకి పాతికేళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీసుకుంది. ప్రేమికుడు తిరస్కరించడంతో ఆమె ఈ పనికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమెను విరుగమ్‌బాకానికి చెందిన డి. మెర్సీ సత్యరాణిగా పోలీసులు గుర్తించారు.

బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో మెర్సీ సత్యరాణి ఏడో అంతస్థులోని కిటికీ తెరిచి అక్కడి నుంచి కిందికి దూకిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. భవనంపై నుంచి దూకే ముందు తనకు సంబంధించిన వస్తువులను అన్నింటినీ పక్కన పెట్టేసిందని చెబుతున్నారు.

భోజన విరామ సమయంలో మధ్యాహ్నం చాలా ఆందోళనగా కనిపించిందని, సాయంత్రం కూడా ఏమీ తినలేదని అంటున్నారు. లంచ్ బాక్స్ తెరిచిన సమయంలోనే ఆమెకు బయటి నుంచి ఓ ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆమె బల్ల నుంచి దూరంగా వెళ్లిపోయి ఫోన్‌లో మాట్లాడుతూ ఉండిపోయింది. సంబంధంలో తలెత్తిన సమస్యే అందుకు కారణమని భావిస్తున్నారు. అయితే, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు అంటున్నారు.

మెర్సీ సత్యరాణి 2009 నుంచి ఆ సంస్థలో అసోసియేట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. మెర్సీ తన తండ్రి దేవదాసన్ జాన్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని, మెర్సీ కుటుంబ సభ్యులను ఆదుకుంటామని, పోలీసులకు అవసరమైన సహాయం అందిస్తామని పోలారిస్ అధికార ప్రతినిధి చెప్పారు.

English summary
A 25-year-old woman software engineer committed suicide by jumping from the seventh floor of Polaris Software Lab Limited (PSLL) in Navalur on Wednesday evening. the police said D. Mercy Sathyarani, a resident of Virugambakkam, was probably dejected over a lover affair and decided to take her life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X