చిరు హోల్‌సేల్, బాబు రిటైల్: విజయమ్మ, రాని జలగం

సహకార ఎన్నికల్లో గెలిచినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత ఎన్నికలలో గెలవాలంటే పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చంచల్ గూడ జైల్లోనే ఉంచాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వచ్చే స్థానిక ఎన్నికలలో పార్టీ గెలుపుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ప్రతి పంచాయతీలో పార్టీ జెండా రెపరెపలాడాలని, చిన్నచిన్న మనస్పర్ధలుంటే పక్కనబెట్టాలని కోరారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించారన్నారు. అప్పుడు ఆయనను కొనియాడిన కాంగ్రెసు పార్టీ ఇప్పుడు, కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. కాంగ్రెసు పార్టీ కుట్రతో చివరకు తమ ఇంట్లోని పిల్లల పైన కూడా కేసు పెడతారేమో అన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం తన కుటుంబాన్ని, పార్టీని దెబ్బతీయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు.
విశ్వసనీయత, నిజాయితీ, నమ్మకం వంటి పదాలు వాడుతున్న చంద్రబాబు తన 37 రాజకీయ జీవితం ఎలా సాగిందనేది తిరిగి చూసుకోవాలన్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఖమ్మంలో జరిగిన పార్టీ సదస్సుకు గైర్హాజరయ్యారు. ఈ సంఘటన వెంకట్రావు జగన్ పార్టీని వీడతారని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చినట్లయిందంటున్నారు.












Click it and Unblock the Notifications