రాజీనామాలు: జగన్ పార్టీలో అట్టుడికిన విభేదాలు

గుంటూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు మరింతగా పెరిగాయి. అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్న పది నియోజకవర్గ నేతలు నవభారత్‌లోని ఓ అతిథిగృహంలో శనివారం సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. జిల్లాలోని కళ్యాణదుర్గం పార్టీ కార్యాలయంలో నేతలు బాహాబాహీకి దిగారు. యెల్ల రామ్మోహన్‌రెడ్డిపై కృష్టప్ప వర్గీయులు ప్రత్యర్థులు దాడికి దిగారు. మోహన్‌రెడ్డిపై మహిళలు దాడి చేశారు. దీంతో ఇరు వర్గీయుల మధ్య వాగ్వాదం నెలకొంది.
విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ దాడిపై మోహన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. ఇన్‌చార్జిల నియామకమే వివాదానికి కారణంగా తెలుస్తోంది.
ఇదిలావుంటే, నిజామాబాద్ జిల్లాలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పర్యటనకు ముందే విబేదాలు భగ్గుమన్నాయి. ముగ్గురు నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. మాజీ జడ్పీ చైర్మన్ వెంకటరమణా రెడ్డితో పాటు మునిపల్లి సాయిరెడ్డి, మోహన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications