అభివృద్ధి మంత్రం: జగ్గారెడ్డి తెలంగాణ వ్యతిరేకరాగం

తెలంగాణకు కావాల్సింది ప్రత్యేక రాష్ట్రం కాదని, అభివృద్ధి అని ఆయన అన్నారు. తనది అభివృద్ధి నినాదమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం లేదని, అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనతో ప్రయోజనం పొందేది రాజకీయ నాయకులేనని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే నమ్మకం తనకు ఉందని శాసనసభ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి అన్నారు. 2014 జరిగే సాధారణ ఎన్నికలకు ముందే తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కాంగ్రెసు అధిష్టానానని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో ఆయన శనివారంనాడు మాట్లాడారు.
తెలంగాణపై ఎన్నికల లోపు ప్రకటన చేయకపోతే కాంగ్రెసు పార్టీకి ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. తెలంగాణపైనే కాంగ్రెసు పార్టీకి లాభనష్టాలు ఉంటాయని ఆయన అన్నారు. ఆదివారంనాడు నిర్వహించే తెలంగాణ సభ బలప్రదర్శనలాంటిది కాదని ఆయన అన్నారు.
సమైక్యాంధ్రకు మద్దతు పలికేవారు ఎవరూ లేరని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. తెలంగాణ నాయుకులంతా ఏకమయ్యారని ఆయన శనివారంనాడు మీడియా ప్రతినిధులతో అన్నారు. లగడపాటి రాజగోపాల్ వంటి నాయకులు తెలంగాణవాదులను రెచ్చగొట్టారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications