సమైక్యమంటారా: తెలంగాణపై కావూరి వ్యాఖ్యలు

Kavuri Sambasiva Rao
హైదరాబాద్: తెలంగాణపై తన తాజా అభిప్రాయంపై రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, సీమాంధ్ర నేత కావూరి సాంబశివరావు భగ్గుమన్నారు. పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే శైలజానాథ్‌ సమైక్యవాదం వినిపించగలరా అని ఆయన అడిగారు. శుక్రవారం తాను వెల్లడించిన అభిప్రాయాలను మీడియా వక్రీకరించిందని ఆయన అన్నారు.

రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రిగా శైలజానాథ్ తన ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని ఆయన చెప్పారు. పిసిసి అధ్యక్షుడిగా చేస్తే అలా వినిపించడానికి వీలు లేదని, పిసిసి అధ్యక్ష పదవి ఏ ఒక్క ప్రాంతానికో చెందింది కాదని, తమ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే పిసిసి అధ్యక్షుడిగా కాదనకూడదని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

పార్లమెంటు సభ్యుడిగా తాను సమైక్యవాదాన్ని వినిపించానని, కానీ అలాగే చేయాలని అనలేదని, తమ అభిప్రాయాన్ని కూడా వినాలని పార్టీ అధిష్టానానికి చెప్పానని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం అందరి అభిప్రాయం తీసుకుని ప్రజలకు మేలు జరిగే నిర్ణయం తీసుకుంటుందని, చెడు జరిగే నిర్ణయం మాత్రం చేయదని ఆయన అన్నారు.

కేంద్ర మంత్రి పదవి స్వీకరించిన తర్వాత తొలిసారి కావూరి సాంబశివరావు కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీభవన్‌కు వచ్చారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఆయన సమావేశమైన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని, త్వరలోనే తెలంగాణపై తుది నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్యంలో అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉందని ఆయన అన్నారు. తాను రాష్ట్ర మంత్రిని కాదని, కేంద్ర మంత్రిని అని, అందువల్ల కేంద్ర మంత్రిగా అధిష్టానం ఆలోచనలను అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కేంద్ర మంత్రిగా తనకు అన్ని ప్రాంతాలవారు సమానమేనని కావూరి అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నా అధిష్టానం నిర్ణయమే ఫైన్ల్ అని ఆయన అన్నారు.

కావూరిని సమర్థించిన పితాని

తెలంగాణ అంశంపై కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పార్థసారథి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి కావూరి చేసిన వ్యాఖ్యలు సీమాంద్రుల్ని కించపరిచేలా లేవని అన్నారు. తెలంగాణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటే తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు కట్టుబడి ఉండాలని పార్థసారథి కోరారు.

వ్యక్తిగతంగా తానూ, కావూరి సమైక్యవాదులమేనని, కావూరి యూటర్న్ తీసుకున్నారని అనుకోవడం లేదని సీమాంధ్రకు చెందిన మరో రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. సమైక్యవాదులమే అయినా కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+