కావూరితో కెటిఆర్ భేటీ: నో పొలిటిక్స్ అని వ్యాఖ్య

KT Rama Rao
హైదరాబాద్: కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావుతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు కెటి రామారావు శనివారం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనపై శనివారం కావూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ భేటీ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

అయితే, కరీంనగర్ జిల్లాలోని తన నియోజకవర్గం సిరిసిల్లలో టెక్స్‌టైల్స్ జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును కోరినట్లు కెటిఆర్ చెప్పారు. శనివారం ఉదయం కావూరితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. చేనేత, టెక్స్‌టైల్స్ కార్మికుల సమస్యలను కావూరి దృష్టికి తీసుకుళ్లానని, ఈ భేటీలో రాజకీయాలు చర్చకు రాలేదని ఆయన అన్నారు.

కాగా, తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు పార్టీ తేల్చదని కెటిఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు ఎన్ని సభలు పెట్టినా ప్రయోజనం లేదని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, సమస్య పరిష్కారానికి కాంగ్రెసు అధిష్టానం ప్రయత్నించాలని ఆయన అన్నారు.

కావూరి సాంబశివరావుతో ఏ విధమైన రాజకీయాలు మాట్లాడలేదని, శనివారం కావూరి చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెసు అధిష్టానంలో కావూరి కూడా భాగస్వామిగా ఉన్నారని ఆయన చెప్పారు.

రాహుల్‌తో తెలంగాణ ప్రస్తావన రాలేదు

కాగా, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో తెలంగాణ అంశం ప్రస్తావనకు రాలేదని కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చెప్పారు. పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులతో రాహుల్ గాంధీ సమావేశమైన తర్వాత ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. స్థానిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలని రాహుల్ గాంధీ సూచించినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+