ఎన్టీఆర్ ఫొటో వాడితే చెప్పులతో కొట్టండి: రేవంత్ రెడ్డి

తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా కాంగ్రెస్ పార్టీ మరింత జఠిలం చేస్తోందని మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి తన కుమారుడు జగన్ నెంబర్ వన్‌గా ఉండాలని కోరుకున్నారని, ఇప్పుడు చంచల్‌గూడా జైళ్లో వైయస్ జగన్ నెంబర్ వన్ గానే ఉన్నారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కావూరి వ్యాఖ్యపై పురంధేశ్వరి నో కామెంట్
తెలంగాణపై కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు కేంద్ర మంత్రి పురంధేశ్వరి నిరాకరించారు. దీనిపై కావూరినే సమాధానం అడగాలని ఆమె సూచించారు. అలాగే సుబ్బిరామిరెడ్డితో వివాదంపై తాను ఏమీ మాట్లాడలేనని పురంధేశ్వరి అన్నారు.
విశాఖపట్నం నగరపాలక సంస్థలో బిమిలీ, అనకాపల్లి విలీనాన్ని తాను వ్యతిరేకించడం లేదని, తాను తన వ్యక్తిగతాభిప్రాయం మాత్రమే చెప్పానని ఆమె అన్నారు.
మూడు ముక్కలు చేయాలి: కోట్ల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే మూడు రాష్ట్రాలుగా చేయాలని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారంనాడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆయన మాట్లాడారు. లేదంటే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications