నా వద్ద పనిచేశాడు, నాపైకి బాబు ఉసిగొల్పాడు: విహెచ్

V Hanumanth Rao
న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల పాటు అధికారం కోల్పోయినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఇంకా బుద్ధి రాలేదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి.హన్మంతరావు విమర్శించారు. ఉత్తరాఖండ్‌ బాధితులను ఆదుకునే విషయంలో చంద్రబాబు వరద రాజకీయాలు, శవరాజకీయాలు చేశారని, ఆ క్రెడిట్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దక్కకూడదన్న లక్ష్యంతోనే బాధితులకు సాయం అందకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

చంద్రబాబు రాజకీయాలు వెగటు పుట్టిస్తున్నాయని, జాతీయ మీడియా కూడా చంద్రబాబు వైఖరిని తప్పుపట్టిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయం వల్ల బాధితులకు అందవలసిన 7 వేల రూపాయల నష్టపరిహారం అందకుండా పోయిందని అంటూ ఇప్పుడు వాటిని ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

తాను యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన్పుడు తన దగ్గర పనిచేసిన చంద్రబాబునాయుడు అప్పట్లో చిత్తూరు జిల్లాలో వచ్చిన వరద బాధితులను ఆదుకునేందుకు రైలులో వెళ్లినప్పుడు తనకు స్వాగతం పలికారని, ఆ చొరవతోనే తాను చంద్రబాబుతో మాట్లాడానని చెప్పారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నీకు ఇలా చేయడం తగునా అన్నానని, అందుకు బాబు టీడీపీ ఎంపీలను తనపైకి ఉసిగొల్పారని ఆరోపించారు.

జాతీయ స్థాయి నాయకుడిగా పేరున్న చంద్రబాబును తృతీయ ఫ్రంట్‌ నేతలు నమ్ముకుంటే నట్టేట మునుగుతారని హెచ్చరించారు. తాము ప్రభుత్వం ఏర్పాటుచేసిన విమానంలో బాధితులను తరలిస్తుంటే చంద్రబాబు వచ్చి అడ్డుకున్నారని, వారికి ప్రభుత్వం భోజన వసతి కల్పిస్తే దాన్ని కూడా అడ్డుకుని, వారిని బస్సుల్లో తీసుకువెళ్లారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+