భార్యను నరికి చంపిన భర్త: యువతిపై రేప్, ఆపై హత్య

హైదరాబాదు నగరంలోని కోకాపేటసెజ్ ప్రాంతంలో కీచకపర్వం చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు ఓ యువతిపై అత్యాచారం జరిపి ఆపై ఆమెను హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థినులు అదృశ్యం
గుంటూరు జిల్లాలోని నర్సారావుపేటలో ఓ ప్రైవేటు కాలేజీ నుండి ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థినులు అదృశ్యమయ్యారు. గత బుధవారం ప్రకాశ్‌నగర్ నుంచి విద్యార్థినిలు కాలేజీకి వెళ్లారు. అప్పటి నుంచి నాలుగు రోజులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వన్‌టౌన్ పీఎస్‌లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని వెంకటనగరంలో ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. రోడ్డు దాటుతున్న సమయంలో వృద్ధులను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైతు ఆత్మహత్య
మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని పిరట్‌వానిపల్లి గ్రామానికి చెందిన నిడిగొండ వెంకటయ్య అనే 35 ఏళ్ల రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం అతను ఆత్మహత్య చేసుకోగా శనివారంనాడు వెలుగు చూసింది. అప్పుల బాధతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. తన సొంత పొలంలో బోర్లను వేయడానికి రూ.1.5 లక్షలు అప్పు చేశాడు. సరైన దిగుబడి రాక అప్పులు తీర్చే మార్గం కనిపించక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి తల్లి, భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.












Click it and Unblock the Notifications