వరదల ట్రాజెడీ: పేరెంట్స్ మిస్, మహిళ ఆత్మహత్య

వారు జూన్ 5వ తేదీన కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లారు. వారి సమాచారం తెలియకపోవడంతో మమతా త్రిపాఠీ శుక్రవారం ఉరేసుకుని చనిపోయింది. తన భార్య తల్లిదండ్రుల జాడ తెలుసుకోవడానికి మమతా త్రిపాఠీ భర్త జూన్ 18వతేీదన హరిద్వార్ వెళ్లాడు. తన తల్లిదండ్రులతో మమతా త్రిపాఠీ చివరి సారి జూన్ 15వ తేదీన మాట్లాడింది. ఆ తర్వాత సంబంధం తెగిపోయింది.
తన తల్లిదండ్రుల రక్షణను కోరుతూ ప్రార్థనలు చేయడానికి మమతా త్రిపాఠీ శుక్రవారం మానసాదేవి ఆలయానికి వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల కోసం వంటలు చేసింది. భోజనం చేసిన తర్వాత తన గదిలోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకుంది.
ఉత్తరాఖండ్‌లో వరదల్లో, కొండచరియల్లో ఇరుక్కుపోయిన మరో 3 వేల మంది జాడ ఇంకా తెలియడం లేదు. వేయి మందికి పైగా ఈ ఉత్పాతంలో మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రకృతి విలయతాండవానికి కేదార్‌నాథ్ స్మశానంలా మారింది.












Click it and Unblock the Notifications