కలిసుంటామని సర్వే, కావూరి మారారని అడుసుమిల్లి

బహిరంగ సభ ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలియజేయడం మంచి పరిణామమన్నారు. ఇప్పటి వరకు ప్రజల ఆకాంక్షలు తెలిపేందుకు కాంగ్రెస్ నేతలు తెరాసకు చాకిరీ చేశారన్నారు. గతంలో తెరాసతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌కు యూపిఏ భాగస్వామ్య పార్టీలను ఒప్పించడంలో కాస్త ఆలస్యం కావడంతో తెలంగాణ ప్రక్రియ ఆలస్యమైందన్నారు. ప్రభుత్వంలో భాగస్వామి అయినా ఓపిక పట్టలేక తెరాస విడిపోయిందన్నారు.
ఎన్నికలకు ముందే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటు చేస్తుందని నమ్ముతున్నామన్నారు. తెరాస వంటి పార్టీలు తెలంగాణ జాగో ఆంధ్రా భాగో వంటి నినాదాలు చేయడం ఆంధ్రా ప్రాంతాల వారిని భయపెడుతున్నాయని, ప్రాణాలైనా అర్పించి తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజలను ఆదుకుంటామన్నారు. తెరాసలో చేరిన ఎంపీలు తొందరపడ్డారని, వారు ఆ పార్టీలో ఉండి ఏమీ సాధించలేరన్నారు.
సమైక్యవాదం వినిపిస్తాం: వివేకా
ప్రభుత్వానికి, పార్టీకి సవాల్‌గా మారిన తెలంగాణ సమస్యను అత్యంత సున్నితంగా పరిష్కరించగల వ్యక్తి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అని ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. సమైక్య వాదం వినిపించేందుకు తాము రాజధానికి వెళుతున్నట్లు చెప్పారు.
మేం సమైక్యవాదులమే: పితాని
తాను, కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు సమైక్యవాదులమేనని, కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన రాజ్యాంగానికి లోబడి ఉండాలని, వ్యక్తిగతం వేరని, మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.
మూడు ముక్కలు: కోట్ల
రాష్ట్రాన్ని విడదీయాల్సి వస్తే మూడు రాష్ట్రాలుగా విభజించాలని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. తాను మొదటి నుంచి సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని, రాష్ట్ర ప్రజలు కూడా సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని చెప్పారు.
ఒప్పుకోం: శోభ
రాయల తెలంగాణ ఏర్పాటును ఒప్పుకోమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి అన్నారు. రాయలసీమ జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని, లేని పక్షంలో సమైక్యాంధ్రగానే ఉంచాలని డిమాండ్ చేశారు.
కావూరిపై అడుసుమిల్లి ఫైర్
ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని కావూరి సాంబశివ రావు ఢిల్లీలో తాకట్టు పెట్టారని మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ విమర్శించారు. విభజన విషయంలో రాజీపడక తప్పదన్న ఆయన వ్యాఖ్యలు ఆంధ్రా ప్రజల మనసులను గాయపర్చాయన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్న ఆయన, కేంద్రమంత్రి అవగానే విభజన విషయంలో రాజీపడాలని చెప్పడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications