మహిళా ఎస్సైతో 3 ఏళ్లు కలిసుండి మోసం: జడ్జి అరెస్ట్

పోలీసులు అరెస్టు చేసి అతనిని కోర్టులో ప్రవేశ పెట్టారు. తిరువూరు జిల్లా కోర్టు నిందితుడికి రెండు వారాల రిమాండ్ విధించింది. కోయంబత్తూరుకు చెందిన తాను, మెజిస్ట్రేటుగా పని చేస్తున్న వ్యక్తి కొంతకాలంగా కలిసి జీవిస్తున్నామని(లివ్ ఇన్ రిలేషన్), అతను తనను వివాహం చేసుకుంటానని చెప్పాడని తెలిపారు.
ఇప్పుడు తనకు తెలియకుండా మరో మహిళను వివాహమాడాడని మహిళా ఎస్ఐ ఫిర్యాదు చేశారు. ముప్పై ఏళ్లున్న సదరు న్యాయమూర్తి ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జిగా ఉన్నారు. అతని పెళ్లైన మరునాడే పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్ఐ అయిన మహిళతో అతను మూడేళ్లుగా సంబంధం కొనసాగిస్తున్నాడు.
పోలీసులు అతనిని నమక్కల్ జిల్లా కొమరపాలయం ప్రాంతంలో శనివారం అరెస్టు చేశారు. అక్కడి నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువూరు కోర్టులో హాజరుపర్చారు.












Click it and Unblock the Notifications