వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌పై రెఫరెండం, టిఆర్ఎస్‌లాగే మావాళ్లు: ఆనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sailajanth - Anam Vivekananda Redd
హైదరాబాద్: దమ్ముంటే హైదరాబాద్ పైన రెఫరెండం పెట్టాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి సోమవారం అన్నారు. సీమాంధ్ర నేతలు కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు. అనంతరం సీమాంధ్ర నేతలు మాట్లాడారు. తెలంగాణ ప్రాంత నాయకుల త్యాగాల వెనుక స్వార్థం, మోసం ఉన్నాయని, తమ త్యాగాల వెనుక విశాలాంధ్ర భవిష్యత్తు ఉందని ఆనం వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రాంత నేతలు నష్టపోయినట్లుగా చెబుతున్నారని కానీ ఇన్నాళ్లుగా, నష్టపోయింది రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలే అన్నారు. సీమాంధ్ర నేతలు అన్యాయం చేశారని చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ ప్రాంత నేతల ఆర్భాటాలు పదవుల కోసమే అన్నారు. త్యాగాలు తాము కూడా చేయగలమన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే తాము దేనికైనా సిద్ధమని దిగ్విజయ్‌కు చెప్పామన్నారు. తెలంగాణ నేతల త్యాగాల వెనుక స్వార్థం ఉంటే, తమ త్యాగాల వెనుక జాతి గౌరవముందన్నారు.

సెంటిమెంట్ అనే పదాన్ని తెలంగాణ నేతలు ఆయింటుమెంటులా ఉపయోగించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని అన్ని పార్టీలది అదే అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అయితే కెసిఆర్ అండ్ కో ప్రైవేట్ కంపెనీగా మారిందన్నారు. టిడిపి చావలేక బతకలేక వెంపర్లాడుతోందన్నారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న నేతల్లో తమ కాంగ్రెసు నేతలు ప్రత్యేకం ఏమీ కాదన్నారు. అందరూ దొంగలే అన్నారు.

మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవుల కోసం తెలంగాణ ప్రాంత అన్ని పార్టీల నేతలు సెంటిమెంటును ఉపయోగించుకుంటున్నారన్నారు. దమ్ముంటే హైదరాబాదు, సికింద్రాబాదు పైన రాష్ట్రవ్యాప్తంగా రెఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు. నాటి పట్వారీ, పటేల్‌లే ఇప్పుడు తెలంగాణ పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కావూరి యు టర్న్ తీసుకోలేదని చెప్పారు.

సమైక్యం తప్ప మరో మార్గం లేదు: శైలజానాథ్

రాష్ట్రం ఐక్యంగా ఉంచడం తప్ప మరో మార్గం లేదని మంత్రి శైలజానాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏ ఒక్కరి అభిప్రాయంతోనో ఏర్పడిందో కాదన్నారు. తెలుగువారంతా కలిసి ఉండాలని, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలుగు మాట్లాడే వారంతా ఐక్యంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలనన్నింటిని అభివృద్ధి చేయాలన్నారు.

దేశ సమస్యలు దృష్టిలో పెట్టుకొనే తెలంగాణపై నిర్ణయం: టిజి వెంకటేష్

దేశంలోని అంశాలను దృష్టిలో పెట్టుకొని అధికార కాంగ్రెసు పార్టీ తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. సమైక్యంతోనే రాష్ట్రానికి లాభమని, విడిపోతే నష్టాలని ఇదే విషయాన్ని తాము దిగ్విజయ్‌కు చెప్పామన్నారు. ఒక కుటుంబంలో విభేదాలు ఉన్నట్లుగానే తమ పార్టీలోను విభేదాలున్నాయన్నారు. తెలంగాణ సమస్యకు త్వరలో అధిష్టానం ఓ పరిష్కారాన్ని చూపుతుందన్నారు.

English summary
SPS Nellore district Congress MLA Anam Vivekananda Reddy on Monday demanded a referendum on the issue of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X