పిలవలేదు, వెళ్లలేదు: తెలంగాణ సాధన సభపై దానం

రాష్ట్రానికి వచ్చిన పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌కు ఆహ్వానం పలికేందుకు దానం నాగేందర్ తదితరులు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ ఆయన మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని చెప్పారు.
కాగా దిగ్విజయ్ సింగ్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో దానం నాగేందర్, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. దిగ్విజయ్ విమానాశ్రయం నుండి నేరుగా రాష్ట్ర కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్ చేరుకున్నారు.
మధ్యాహ్నం కాంగ్రెసు పార్టీ తెలంగాణ నేతలతో భేటీ కానున్నారు. సాయంత్రం సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలతో భేటీ అవుతారు. మరోవైపు సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు మంత్రి శైలజానాథ్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను ఆయనకు వివరించే విషయమై చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications