వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎన్ఏ మనదే: వైయస్‌ను, జగన్‌ను పోల్చిన దిగ్విజయ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ysr and Ys Jagan
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని పోల్చారు. సోమవారం ఆయన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణపై వారం పది రోజుల్లో కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పిన ఆయన జగన్ అంశం పైనా స్పందించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాల్లో తేడా ఉందని వ్యాఖ్యానించారు. వైయస్ ఓపిగ్గా రాజకీయాలు చేసేవారని, జగన్ మాత్రం ఉండలేకపోయారన్నారు. రాజకీయాల్లో ఆవేశం పనికిరాదని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు. జగన్ పార్టీలోను కాంగ్రెసు డిఎన్ఏ ఉందన్నారు. ఇతర పార్టీలలోకి వెళ్లిన వారు తిరిగి పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని దిగ్విజయ్ చెప్పారు.

వైయస్ వేరు, జగన్ వేరు అన్నారు. వైయస్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని చెప్పారు. రాజకీయాల్లో ఉన్న వారు వ్యాపారాలు మానుకోవాలని సూచించారు. మనం ఐక్యంగా ఉంటే పార్టీని ఎవరూ ఓడించలేరన్నారు. కార్యకర్తలు అంతా కాంగ్రెసును తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు.

కాగా దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర నేతలతో భేటీ అయ్యారు. ఆయనతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కాసు వెంకటకృష్ణా రెడ్డి, శైలజానాథ్ తదితరులు భేటీ అయ్యారు.

English summary
AP Congress Party state incharge Digvijay Singh on Monday said that Congress Core Committee will announce its decision on Telangana with in ten days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X