వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలస్యమైంది, తెలంగాణకు రెండే మార్గాలు: దిగ్విజయ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సమస్య పరిష్కారానికి రెండే ప్రత్యామ్నాయాలు ఉన్నాయని కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సోమవారం అన్నారు. సీమాంధ్ర ప్రాంత నేతలు కలిసిన అనంతరం డిగ్గీని తెలంగాణ ప్రాంత నేతలు కలిశారు. మంత్రులు జానా రెడ్డి, డికె అరుణ, పొన్నాల లక్ష్మయ్య, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు దిగ్విజయ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా డిగ్గీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణపై ఇప్పటికే ఆలస్యమైందని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని అధిష్టానం భావిస్తోందని అన్నారు. తమ ముందు తెలంగాణ సమస్యపై ఉన్న రెండు ప్రత్యామ్నాయాలు... ఒకటి సమైక్యంగా ఉంచటం, రెండు ప్రత్యేక రాష్ట్రంపై ప్రకటన చేయడమన్నారు. దేశం, రాష్ట్రం, కాంగ్రెసు పార్టీని దృష్టిలో ఉంచుకొని తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Digvijay Singh

తనకు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు తమ తమ నివేదికలు ఇచ్చారన్నారు. ఇరు ప్రాంత నేతల అభిప్రాయాలతో తాను అధిష్టానానికి నివేదిక ఇస్తానని చెప్పారు. ఏదో ఒకటి తేల్చేందుకు అధిష్టానం సిద్ధమైందన్నారు. రాష్ట్ర నేతలకు ఎవరైనా ఈ సమస్యపై నివేదికలు ఇవ్వాలనుకుంటే ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్‌కు ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్‌ను స్పష్టమైన నివేదికతో కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ సమావేశానికి రావాలని సూచించినట్లు చెప్పారు.

English summary
Congress party AP political affairs incharge Digvijay Singh on Monday said that only two alternatives are there to solve Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X