దిగ్విజయ్‌కు సమైక్య సెగ, ఏదైనా ఉంటే చెప్తానని వ్యాఖ్య

Digvijay Singh
విశాఖపట్నం/హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌కు ఆదివారం వచ్చీరాగానే విశాఖపట్నంలో సమైక్య సెగ తగిలింది. దిగ్విజయ్ ఆదివారం సాయంత్రం విశాఖ వచ్చిన సందర్భంగా పలువురు సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి నాయకులు ఆయనను కలిశారు. రాష్ట్రాన్ని విభజిస్తే పలు సమస్యలు తలెత్తుతాయని, అందువల్ల రాష్ట్రాన్ని విడగొట్టొద్దని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు.

చిన్న రాష్ట్రాల వల్ల దేశాభివృద్ధికి విఘాతం కలుగుతుందని, ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. విమానాశ్రయం ఆవరణలో బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని 'తెలుగు ప్రజలను విడగొట్టొద్దు' 'జై సమైక్యాంధ్ర' అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులు వారిని తప్పించారు. ఈ కార్యక్రమంలో ఆడారి కిశోర్ కుమార్, కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.

ఏదైనా ఉంటే చెబుతా: దిగ్విజయ్

రాష్ట్ర విభజన విషయంలో త్వరలోనే ఏదో ఒక నిర్ణయం వస్తుందని ఆయన విశాఖలో అన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకోగానే మీడియాకు చెబుతానని ఆయన తెలిపారు. 2009 తర్వాత రాష్ట్రంలో పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన నేతలు వాళ్ల అభిప్రాయాలను తన దృష్టికి తెచ్చారని.. ఏది ఏమైనా రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొనాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు.

కాగా దిగ్విజయ్ సింగ్ విశాఖ నుండి సోమవారం ఉదయం హైదరాబాదుకు బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సిబిఐని కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని బిజెపి అనడం సరికాదన్నారు. బిజెపిది రెండు నాల్కల ధోరణి అన్నారు. బిజెపి నేత గోపీనాథ్ ముండే తాను ఎన్నికలలో రూ.8 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి చిక్కుల్లో పడ్డారని గుర్తు చేశారు. ఆయన పరిస్థితి సముద్రంలోకి దూకినట్లేనని అన్నారు.

ఈ రోజు హైదరాబాద్‌లో దిగ్విజయ్‌ను ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కలవనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రుల క్వార్టర్స్‌లో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు సమావేశమై.. తర్వాత లేక్‌వ్యూ అతిథి గృహంలో డిగ్గీరాజాను కలసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరనున్నారు.

తెలంగాణ ప్రజా ప్రతినిధులు కూడా బృందంగానే ఆయనను కలసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరనున్నారు. కాగా.. 12 గంటలకు రవీంద్రాభారతిలో జరిగే 20 సూత్రాల పథకం కార్యక్రమంలో పాల్గొంటారు. గాంధీభవన్‌లో 4 గంటలకు దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరగనున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+