గెలుపే జగన్‌కి బహుమతి: విజయమ్మ, వస్తాడని షర్మిల

జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెసు, టిడిపిలు కుమ్మక్కయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాడాలని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. ఎప్పుడైనా మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని విజయమ్మ గుర్తు చేశారు. కానీ అలాచేస్తే ఓడిపోతామనే భయంతో ముందుగా పార్టీ ప్రమేయంలేని గ్రామ పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని ఎద్దేవా చేశారు.
ప్రజల ఆశీస్సులతో మన పార్టీయే గెలుస్తుందన్నారు. గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు కూడా నవంబర్, డిసెంబర్‌లలో వచ్చే అవకాశముందన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు చేతులు కలిపిన చరిత్ర ఎక్కడా లేదన్నారు. బాబుకు ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదన్నారు. అధికారంలో ఉండీ ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు అన్నీ చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
కొందరు మంత్రులు, అధికార పార్టీ నేతలు జగన్ పై, తమ కుటుంబంపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని సదస్సులో విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు వెన్నుపోటుదారులో ప్రజలకు తెలుసని మంత్రి రఘువీరా రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నేతలు జగన్, భారతి, షర్మిల, తనపై, చివరకు తన మతం పైనా మాట్లాడారని, ఇక వారి మాట్లాడేందుకు మిగిలింది ఇంట్లోని చిన్నపిల్లలు మాత్రమే అన్నారు.
తెలంగాణపై..
వైయస్ ఎప్పుడూ పేదలకోసం ఆలోచించేవారని, తెలంగాణవాదాన్ని గౌరవిస్తూనే, అభివృద్ధి లక్ష్యంతో ముందుకు వెళ్ళేవారన్నారు. తెలంగాణపై నిర్ణయం మనచేతుల్లో లేదు. ప్లీనరీలోనూ జగన్ ఇదే చెప్పారు. వైయస్ ఉంటే ఇప్పటికే జలయజ్ఞం పూర్తయ్యేది. తెలంగాణ రైతులకు భరోసా కల్పించే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసేవారన్నారు. తెలంగాణ తమ చేతిలో లేదన్నారు. దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని చెప్పారు.
జగన్ వస్తాడు: షర్మిల
జగన్ జైలు నుంచి వస్తాడని, ముఖ్యమంత్రి అవుతాడని, ప్రజల కష్టాలు తీరుస్తాడని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. ఆమె పాదయాత్ర విశాఖలో కొనసాగుతోంది. జగన్ సీఎం అయ్యాక అందరి కష్టాలు తీరుతాయని గజపతినగరంలో మహిళలకు భరోసా ఇచ్చారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications