వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశిష్ట స్థలాలు: తాజ్ థర్డ్, ఆంగ్‌కోర్ వాట్ గుడి సెకండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Taj Mahal
న్యూయార్క్: ప్రపంచంలోని అత్యుత్తమ ఆకర్షణీయ ప్రదేశాలలో మన దేశంలోని తాజ్ మహల్‌కు మూడో స్థానం దక్కింది. తాజ్ మహల్‌ను ప్రేమకు ప్రతిరూపంగా భావిస్తారు. దీనిని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా రోజుకు వేలాది మంది వస్తారు. ట్రిప్ అడ్వైజర్స్ అనే ట్రావెల్ వెబ్ సైటు తాజ్ మహల్ మూడో స్థానాన్ని దక్కించుకున్నట్లు వెల్లడించింది.

ట్రావెలర్స్ ఛాయిస్ అట్రాక్షన్ అవార్డ్స్ 2013లో ప్రయాణీకులు ప్రపంచవ్యాప్తంగా 25 అత్యుత్తమ ఆకర్షణీయ ప్రదేశాలకు ఓటు వేశారు. ఈ జాబితాలో కంబోడియాలోని ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం కూడా చోటు సంపాదించుకుంది. ఇది జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

మొదటి స్థానంలో పెరులోని మచ్చుపిచ్చు, రెండో స్థానంలో కాంబోడియాలోని ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం, మూడో స్థానంలో తాజ్ మహల్, నాలుగో స్థానంలో జోర్డాన్‌లోని పెట్రా వరల్డ్ హెరిటేజ్ సైట్, ఐదో స్థానంలో కంబోడియాలోని బయోన్ గుడి, ఆరో స్థానంలో స్పెయిన్‌లోని గ్రేట్ కాతెడ్రాల్ అండ్ మసీద్, ఏడో స్థానంలో రష్యాలోని చర్చ్ ఆఫ్ అవర్ సేవియర్, ఎనిమిదో స్థానంలో ఇటలీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా, తొమ్మిదో స్థానంలో క్రొటేరియాలోని ఆన్సియెంట్ సిటీ వాల్స్, పదో స్థానంలో పోలాండులోని మెయిన్ మార్కెట్ స్క్వేర్ నిలిచాయి.

కాగా పూర్తిగా పాలరాతితో నిర్మించిన తాజ్ కట్టడం 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఏటా 20 లక్షల నుండి నలభై లక్షల వరకు తాజ్‌ను సందర్శిస్తుంటారు.

English summary
Travellers from across the globe have ranked India's Taj Mahal among the top three landmarks in the world, a leading travel website has announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X