జగన్ వల్లే ఇబ్బంది, మేం ఓడితే రాష్ట్రం: తెలంగాణపై టిజి

ఇతర పార్టీలు తెలంగాణకు మద్దతిస్తున్నాయని, వారిని సీమాంధ్ర ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీని గెలిపిస్తే విభజనను అడ్డుకుంటామని, ఓడిస్తే మాత్రం తెలంగాణ ఖాయమని హెచ్చరించారు. తెలంగాణకు మద్దతు పలుకుతున్న పార్టీలకు ప్రజలు ఓట్లు వేయడం దురదృష్టకరమన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, బిజెపి, సిపిఐ పార్టీలను దూరం పెట్టాలన్నారు.
విభజనను అడ్డుకుంటుంది సీమాంధ్ర కాంగ్రెసు నేతలే అన్నారు. ఇతర పార్టీల నాయకులు తెలంగాణ ప్రకటిస్తే వారికి ఎటువంటి ఇబ్బంది లేదని అంటున్నా.. సమైక్యాంధ్ర ప్రజలు వారిని అడ్డుకోకపోవడం శోచనీయమని, వారికి ఓటు వేయడం సరికాదని అన్నారు. తెలంగాణ ప్రకటిస్తే తప్పు ప్రజలదా.. నాయకులదా అని ప్రశ్నించారు.
లగడపాటికి మతిభ్రమించింది
తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శాడిస్టులా వ్యవహరిస్తున్నారని, ఆయనకు మతిభ్రమించిందని తెలంగాణ రాష్ట్ర సమితి నేత శ్రవణ్ అన్నారు. తెలంగాణపై శాసన సభలో తీర్మానాన్ని అడ్డుకుంటామని చెబుతూ రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న రాజగోపాల్ పైన క్రిమినల్ కేసు పెట్టాలన్నారు.












Click it and Unblock the Notifications