వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిజికి గన్ పట్టే అలవాటు లేదు, మాకు ఉంది: పొన్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
కరీంనగర్/న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని విభజిస్తే అగ్ని గుండమవుతుందన్న చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్‌కు తుపాకులు పట్టే అలవాటు లేదని, తమకు అది రజాకార్ల కాలం నుండే ఉందని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ గురువారం కరీంనగర్ జిల్లాలో అన్నారు. టిజి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దన్నారు. నేతలు రాజీనామా చేస్తామని చెప్పినా అధిష్టానం ఇప్పుడు పట్టించుకునే స్థితిలో లేదన్నారు.

తెలంగాణ సాధనే లక్ష్యం: కోదండ

తెలంగాణ సాధనే తమ లక్ష్యమని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. తెలంగాణ ఐకాస చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి బిజెపి, టిఆర్ఎస్, జనతా పార్టీ, సోషలిస్టు, బోడో ల్యాండ్, జెఎంఎం, అమ్ ఆద్మీ, ఎంసిపి, ఆర్ఎల్డీ, ఐజెపి, సిపిఎం న్యూడెమోక్రసీ, జమ్ము కాశ్మీర్ ప్యాంతర్స్ పార్టీలు హాజరయ్యాయి.

బిజెపి నుండి దత్తాత్రేయ, టిఆర్ఎస్ నుండి కె కేశవ రావు, వివేక్, ఆర్ఎల్డీ నుండి కెఎస్ మాన్, రియాజ్, సిపిఐ నుండి అజీజ్ భాషాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండ మాట్లాడారు. తెలంగాణ సాధనే తమ లక్ష్యమని, పోరాటం సాగిస్తామని, తెలంగాణపై కాంగ్రెసు పార్టీ మాట నిలబెట్టుకోలేక పోయిందన్నారు. కాంగ్రెసు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిందన్నారు. ప్రాణత్యాగాలు ప్రజాస్వామానికే అవమానమన్నారు. ఇంకెంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించారు.

తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సిపిఐ నేత డి.రాజా అన్నారు. తెలంగాణకు తమ పార్టీ మద్దతిస్తోందన్నారు. తెలంగాణపై ప్రకటన చేస్తే ఉద్యమాలు ఉండవని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్రంపై అధారాపడి ఉందన్నారు.

English summary
Karimnagar MP and Congress Party senior leader Ponnam Prabhakar said on Thursday that Telangana people are using guns from Nizam time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X