గర్ల్స్‌కి వల: సినిమాకి రావాలని ఒత్తిడి, ల్యాబ్‌లో వేధింపు

పిహెచ్‌డి సీటు వచ్చేలా చూస్తానని చెప్పి తనతో సినిమాలకు రావాలని, అలా బయటకు రావాలని పలువురు అమ్మాయిలను వేధించేవాడట. తాను అడ్మిషన్ తీసుకునే సమయంలోనే శివశంకర్ పరిచయమయ్యాడని, తొలుత తనను బాగా చదువాలని, సీటు వచ్చేలా చూస్తానని చెప్పాడని, ఆ తర్వాత క్రమంగా తనను వేధించడం ప్రారంభించాడని ఒకరు ఫిర్యాదు చేశారు.
బాధితుల్లో ఐదుగురు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగా, మిగిలిన వారు నోటి మాటతో ఫిర్యాదు చేశారు. బాధితుల యువతుల్లో ఐదుగురు పెళ్లైన వారు కావడం గమనార్హం. పోలీసులు అతనిని విచారిస్తున్నారు. నిందిత అధ్యాపకుడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాడు.
మహబూబ్‌నగర్ జిల్లా పానగల్ మండలం కేటేపల్లి గ్రామానికి చెందిన శివశంకర్ భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ)లో చురుగ్గా పనిచేసేవాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. అతను తన బిటెక్, ఎంటెక్‌లను ఉస్మానియాలోనే పూర్తి చేశాడు. తర్వాత ఓయూ టెక్నాలజీ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా చేరాడు.












Click it and Unblock the Notifications