ట్విట్టర్‌లో శశి థరూర్ 'టాప్' లేపిన నరేంద్ర మోడీ

ఇటీవలే థరూర్ టాప్‌ను మోడీ లేపేశారు! ట్విట్టర్‌లో మోడీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 18,26,055 ఉండగా, శశి థరూర్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 18,21,776గా ఉంది.
బిజెపి సీనియర్ నేత, లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ 5,23,336 మంది ఫాలోవర్స్, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ 54,968 మంది ఫాలోవర్స్, అమ్ అద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మంది 4,12,289 ఫాలోవర్స్ ఉన్నారు.
సాంకేతికతను ఎప్పటికప్పుడు వినియోగించుకోవడంలో నరేంద్ర మోడి ముందున్నారు. సామాజిక వెబ్ సైట్లను రాజకీయ నాయకులు ఎన్నికలకు తమ ప్రధాన ప్రచారాస్త్రంగా భావిస్తున్నారని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ వరదల సమయంలో కాంగ్రెసు, బిజెపిలు ట్విట్టర్ బాటిల్‌కు దిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications