సమైక్య ప్రకటన చేస్తే కాంగ్రెస్‌కు 25 ఎంపీ సీట్లు: గంటా

శాసనసభలో విభజన తీర్మానం వీగిపోతుందని, సమైక్యవాదమే గెలుస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరం గురించి ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌కు చెప్పామని, అంతకు ముందు కాంగ్రెసు కోర్ కమిటీ సభ్యులకు కూడా చెప్పామని ఆయన అన్నారు.
విభజన వివాదంపై ప్రతిష్టంభన తొలగించాల్సిన అవసరం ఉందని దిగ్విజయ్ సింగ్ పదే పదే చెప్పారని ఆయన అన్నారు. ఈ స్థితిలో సమైక్యవాదాన్ని వినిపించడానికి సీమాంధ్రలో సభలు పెట్టాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. తొలుత అనంతపురంలో ఈ నెల రెండో వారంలో సభ నిర్వహిస్తామని, రాయలసీమ ప్రజలు రాయల తెలంగాణ కోరుకోవడం లేదనే విషయాన్ని ఈ సభ ద్వారా చాటి చెప్తామని ఆయన అన్నారు. ఆ తర్వాత విశాఖపట్నంలోనూ హైదరాబాదులోనూ సభలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రాయలసీమ, ఆంధ్ర ప్రజలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటున్నారు కాబట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే కాంగ్రెసును ఈ ప్రాంతాల ప్రజలు గెలిపిస్తారని ఆయన అన్నారు.
దిగ్విజయ్‌తో కోదండరామ్ టీమ్ భేటీ
తెలంగాణపై త్వరలోని నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. ఢిల్లీలో తెలంగాణ జెఎసి నేతలు శుక్రవారం దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. ఆ తర్వాత కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. త్వరలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రజలకు చెప్పాలని దిగ్విజయ్ సింగ్ తమకు సూచించినట్లు ఆయన తెలిపారు .
తెలంగాణపై బిల్లును ప్రతిపాదించే వరకు తాము ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరిస్తేనే ప్రయోజనం ఉంటుందని తాము దిగ్విజయ్ సింగ్‌కు చెప్పినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు కూడా దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. తెలంగాణ అంశాన్ని కోర్ కమిటీ సమావేశంలో ప్రస్తావిస్తానని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు విహెచ్ తెలిపారు.












Click it and Unblock the Notifications