వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బతికి ఉండటం దండగ: తులసిరెడ్డి, బైరెడ్డి దీక్షకి మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tulasi Reddy
హైదరాబాద్: భవిష్యత్తులో రాయలసీమ అన్నది వినపడదు, కనపడదు అనుకుంటే ఇక బతికి ఉండటమే దండగ అని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసి రెడ్డి శుక్రవారం అన్నారు. రాయల తెలంగాణను విభజించవద్దంటూ రాయలసీమ పరిరక్షణ వేదిక చైర్మన్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేస్తున్న 52 గంటల దీక్షకు తులసి రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడారు.

రాయలసీమను ముక్కలు చేసే ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ముక్కలు చేసే ప్రతిపాదనను రాయలసీమ ప్రజలంతా ప్రతిఘటించాలన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మాదిగ రిజర్వేషన్ హక్కుల పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) మద్దతు ప్రకటిస్తోందని అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రకటించారు. బైరెడ్డి దీక్షకు తమ సంపూర్ణ మద్దతుందన్నారు.

వెయ్యి మంది సోనియా గాంధీలు, లక్షమంది దిగ్విజయ్ సింగ్‌లు వచ్చినా రాయలసీమ జిల్లాలను విడగొట్టలేరన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం సీమ జిల్లాలను విభజించాలని చూస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఆయనకు ఢిల్లీ చుట్టు ప్రదక్షిణలు చేసి, పదవిని కాపాడుకునేందుకే సమయం సరిపోతుందని ఎద్దేవా చేశారు. రాయలసీమ జిల్లాల విభజనపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు.

సమైక్యం కోసం సంతకాలు

రాష్ట్రాన్ని విభజించవద్దంటూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గుంటూరులో సంతకాల సేకరణ చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు పాల్గొని సంతకం చేశారు.

English summary
Congress Party senior leader Tulasi Reddy supported Rayalaseema Parirakshana Samithi leader Byreddy Rajasekhar Reddy deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X