కొత్త మలుపు: ఇష్రాత్ జహాన్ మానవ బాంబా?

గుజరాత్ పోలీసులు జరిపిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ఇష్రాత్ జహాన్ ఓ మానవ బాంబు అని హెడ్లీ వెల్లడించిట్లు చెబుతున్నారు. ఇష్రాత్ జహాన్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు లేవని సిబిఐ తన చార్జిషీట్‌లో చెప్పిన నేపథ్యంలో ఈ వార్తలు రావడం సంచలనాన్ని సృష్టిస్తోంది.
ఇష్రాత్ జహాన్‌కు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు హెడ్లీ చెప్పినట్లు సమాచారం. లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ కమాండర్ జహీవుర్ రెహ్మాన్ లఖ్వీ పన్నిన వ్యూహం ఇష్రాంత్, మరో ముగ్గురి మృతితో విఫలమైందని హెడ్లీ చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
ఈ వార్తా కథనాలకు కాంగ్రెసు ప్రధాన కార్యదర్సి దిగ్విజయ్ సింగ్ ప్రతిస్పందించారు. ఇష్రాత్ జహాన్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా, లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆయన హోం మంత్రిత్వ శాఖను డిమాండ్ చేశారు. ఇష్రాత్ జహాన్ కేసులో అనధికారికంగా ఎంపిక చేసిన విషయాలను వెల్లడించడం వల్ల ప్రజల్లో అయోమయం ఏర్పడుతోందని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, ఇష్రాత్ జహాన్‌ను జనతాదళ్ (యు) నేత అలీ అన్వర్ బీహార్ పుత్రికగా అభివర్ణించారు. ఆమెకు న్యాయం చేయాలని కోరారు. జహాన్‌ను బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేశారని సిబిఐ చెప్పిందని ఆయన అన్నారు. ఈ కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి, అమిత్ షాకు పాత్ర ఉందని తాను వ్యక్తిగతంగా నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications