వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పని మనిషితో స్వలింగ సంపర్కం: మంత్రి రాజీనామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

భోపాల్: స్వలింగ సంపర్కం ఆరోపణలతో మధ్య ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి రాఘవ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇంట్లోని పని మనిషి రాఘవ్ పైన స్వలింగ సంపర్కానికి పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ రోజు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాఘవ్ తన రాజీనామా లేఖను ఇచ్చారు.

దీనిని గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ వద్దకు పంపారు. ఆయన రాజీనామాను ఆమోదించాల్సి ఉంది. రాఘవ్ పైన ఆరోపణలు వచ్చిన వెంటనే రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మంత్రి తనతో స్వలింగ సంపర్కం నెరిపారంటూ పని మనిషి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు.

Raghavji

అందుకు సంబంధించి ఓ వీడియోను కూడా పోలీసులకు అందజేశాడు. మంత్రికి చెందిన ఇద్దరు అనుచరులు కూడా తనతో అలాగే చేశారని ఆరోపించాడు. ఈ స్వలింగ సంపర్క రాసలీలలను మరో పని మనిషి రహస్యంగా చిత్రీకరించినట్లు అతను చెప్పాడు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను రాఘవ్ కొట్టిపారేశారు. ఇవి రాజకీయ ఆరోపణలే అని చెప్పారు.

రాఘవ్ గత పదేళ్లుగా రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి రికార్డ్ సృష్టించాడు. అతను 2004 నుండి 2013 వరకు బడ్జెట్ ప్రవేశ పెట్టాడు. కాగా రాఘవ్ రాజీనామా చేయడంతో ఆర్థిక శాఖ బాధ్యతలను నీటి వనరుల శాఖ మంత్రి జయంత్ మలయ్యాకు ముఖ్యమంత్రి అప్పగించినట్లుగా తెలుస్తోంది.

English summary
MP Finance Minister Raghavji on Friday resigned from his post after an obscene CD purportedly featuring him surfaced and a police complaint by his servant alleging that he was being sexually exploited by the minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X