వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్‌మ్యాప్ కసరత్తు: కావూరి, మంత్రులతో బొత్స భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
న్యూఢిల్లీ: తెలంగాణపై రోడ్ మ్యాప్ కసరత్తులో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మునిగిపోయారు. ఇందులో భాగంగానే ఆయన ఢిల్లీకి చేరుకున్నట్లు అర్థమవుతోంది. ఆయన శనివారం పలు దఫాలుగా సీమాంధ్రకు చెందిన పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. తెలంగాణపై రోడ్ మ్యాప్ తయారు చేయాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలకు సూచించిన విషయం తెలిసిందే.

కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావుతో బొత్స సత్యనారాయణ దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కావూరి సాంబశివరావు గతంలో సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించారు. కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ సమస్యపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కావూరి సాంబశివరావు చెప్పారు. ఈ స్థితిలో బొత్సకు, కావూరికి మధ్య జరిగిన చర్చల వివరాలు తెలియడం లేదు.

కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, పల్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జెడి శీలంలతో బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఒక్కొక్కరితో అరగంట పాటు మాట్లాడారు. కొంత మంది సీనియర్ పార్లమెంటు సభ్యులతో కూడా ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, విభజన అనివార్యమైతే మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.

బొత్స సత్యనారాయణ దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. తెలంగాణపై ఆయన ఓ నివేదికను ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, తాను ఏ విధమైన నివేదిక ఇవ్వలేదని బొత్స మీడియా ప్రతినిధులతో చెప్పారు. అధిష్టానం అడిగినప్పుడు నివేదిక సమర్పించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై నాయకులతో సంప్రదింపులు జరిగాయని, మరి కొంత మంది నాయకులతో కూడా మాట్లాడుతానని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో కూడా మాట్లాడుతానని అన్నారు. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు.

ఇదిలావుంటే, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రోడ్ మ్యాప్ తయారీ కోసం హైదరాబాదులో తెలంగాణ ప్రాంత నాయకులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో రాయలసీమకు చెందిన సీనియర్ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటించిన తర్వాత సీమాంధ్ర శాసనసభ్యుల రాజీనామాకు జెసి దివాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు.

English summary
Meeting union ministers Kavuri Sanabasiva Raom Daggubati Purandheswari and others PCC president Botsa Satyanarayana is busy in preparing road map on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X