వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై నోరు విప్పిన బాబు, ఆయన ప్రధాని: ఎర్రబెల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nara Chandrababu Naidu
హైదరాబాద్: కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మౌనంగా ఉంటూ వస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం నోరు విప్పారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారిపై కేసులు ఎత్తివేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తెలంగాణ కోసం అత్మబలిదానాలు చేసుకున్నవారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. విధిలేని పరిస్థితిలోనే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని ఆయన అన్నారు. పార్టీ ప్రాంతీయ సదస్సులో ఆయన శనివారం ప్రసంగించారు.

రాష్ట్ర విభజన జరిగితే రెండు ప్రాంతాల్లోనూ తమ పార్టీ పటిష్టమవుతుందని, తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని అవుతారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి కోదండరామ్‌పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కోదండరామ్‌ను ఆయన తెలంగాణ ద్రోహిగా అభివర్ణించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, కోదండరామ్ కాంగ్రెసు భిక్ష కోసం ఎదురు చూస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. గ్రామాలకు వస్తే కాంగ్రెసు నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చిన కోదండరామ్ భోజనం కోసం వి. హనుమంతరావు ఇంటి వద్ద కూర్చున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకమని చెప్పనవారిని ఉరికించి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణపై కాంగ్రెసు నాటకాలు ఆడుతోందని అన్నారు.

English summary
Reaction on Telangana issue the Telugudesam party president Nara Chandrababu Naidu said that TDP is not against Telangana. Meanwhile, TDP Telangana forum convenor Errabelli Dayajar Rao lasged out at Kodandaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X