వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోలార్ స్కామ్: మలయాళీ నటి సాలు మీనన్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: సోలార్ ప్యానెల్ కుంభకోణంలో టెలివిజన్ నటి, డ్యాన్సర్ సాలు మీనన్ అరెస్టయ్యారు. సోలార్ ప్యానెల్ కుంభకోణం కేసు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసింది. గత నెల రోజులుగా సోలార్ ప్యానెల్ కుంభకోణం గత నెలలో వెలుగు చూసింది. అప్పటి నుంచి ఆమె పేరు నానుతూ వస్తోంది. కేసులో ప్రధాన నిందితుడు బిజూ రాధాకృష్ణన్‌తో ఆమెకు సంబంధాలున్నాయంటూ దుమారం చెలరేగుతోంది.

పోలీసులు కొట్టాయం సమీపంలోని చంగనసెస్సెరీలో గల ఆమె నివాసానికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆమెను ఎడిజిపి హేమచంద్రన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం చెంగన్నూరు తీసుకుని వెళ్లింది. సాలుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని త్రిసూరు మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Shalu Menon

కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి దర్యాప్తు అధికారులు ఆమెపై ఓ కన్నేసి ఉంచారు. రాష్ట్రం నుంచి పారిపోవడానికి ఆమె సహకరించడానికి సిద్ధపడినట్లు పోలీసులు అనుమానించారు. అనుమానాస్పద స్థితిలో మరణించిన భార్య మృతి కేసులో కూడా బిజూ కోసం పోలీసులు వేట సాగిస్తూ వచ్చారు. సరితతో పాటు అతను సోలార్ కుంభకోణం కేసులో సహ నిందితుడు. సరితా నాయర్, బిజూలకు కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

బిజూకు, సాలు మీనన్‌తో ఉన్న సంబంధాలపై స్థానిక మీడియాలో పెద్ద యెత్తున వార్తలు వచ్చాయి. హోం మంత్రి తిరువంచూరు రాధాకృష్ణన్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు ఆమె నివాసాన్ని లేదా డ్యాన్స్ స్కూల్‌ను సందర్శించినట్లు వెల్లడి కావడంతో ఆమెను ఆరెస్టు చేయాలని ఎల్‌డిఎఫ్ డిమాండ్ చేసింది. అయితే, కుంభకోణంతో తమకు సంబంధం లేదని రాధాకృష్ణన్‌తో పాటు మరికొంత మంది మంత్రులు స్పష్టం చేశారు. సరితను, బిజూను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Television actress and dancer Shalu Menon was taken into custody today in connection with the solar panel scam that has rocked Kerala and brought the office of Chief Minister Oomen Chandy under a cloud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X