టోరంటో విమానాశ్రయంలో భారత నటికి అవమానం
కోల్‌కతా: విదేశాల్లో అవమానాలకు గురవుతున్న సినీ నటుల సంఖ్య పెరుగుతోంది. కమల్ హాసన్, షారూక్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్ వంటి నటులు విదేశీ విమానాశ్రయాల్లో వేధింపులకు గురయ్యారు. తాజాగా రీతుపర్ణ సేన్‌గుప్తా అనే సినీ నటి కెనడాలోని టొరంటో విమానాశ్రయంలో అవమానానికి గురైంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన జాతీయ అవార్డు గ్రహీత అయిన తీరుపర్ణను టోరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారంనాడు ఐదున్నర గంటల పాటు విచారించారు.
టోరంటో విమానాశ్రయానికి మధ్యాహ్నం చేరుకోగానే రీతుపర్ణకు వేధింపులు ప్రారంభమయ్యాయని ఆనందబజార్ పత్రిక రాసింది. 2015 వరకు చెల్లే వీసా ఉన్నప్పటికీ దాని కాలపరిమితి ముగిసిందని ఆమెకు చెప్పారు. ఆమె వ్యక్తిగత సామాన్లను సోదా చేశారు. మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

దాంతో ఆమె కష్టాలు తీరలేదు. అవమానానికి గురై ఏడిస్తే మానసిక రోగిగా ఆమెకు ముద్ర వేశారు. ఆస్పత్రికి పంపిస్తామని బెదిరించారు. వీసా గడువు ముగిసినందున కెనడాలో అడుగు పెట్టనివ్వమని తనకు చెప్పారని, కానీ గడువు ఉందని రీతూపర్ణ చెప్పారు. దాంతో తన వీసా గడువు ముగిసినట్లు ఏమైనా పత్రాలున్నాయా చూపించాలని తాను అడిగానని ఆమె చెప్పింది.
చివరకు బంగా సమ్మేళన్‌కు హాజరు కావడానికి కెనడాలో అడుగు పెట్టడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ఆ సమ్మేళన్‌లో ఆమె చిత్రం ముక్తి ప్రదర్శించారు. ఆమెతో పాటు కెనడాలోనే ఉండే ఆమె అత్తగారింటి తరఫు 80 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నారు. అయినా ఆ వేధింపులు తప్పలేదు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications