రాయల తెలంగాణ తప్పన్న విజయమ్మ, జగన్ చెప్తారు

రాయలసీమను విభజించడం సరికాదన్నారు. తమ పార్టీ రాయలసీమ, ఆంధ్రల్లో బాగుందని, తెలంగాణలో బాగాలేదని కాంగ్రెసు పార్టీ భావించడం వల్లనే విభజనకు పూనుకుందని ఆరోపించారు. విభజించే పరిస్థితి వస్తే రెండుచోట్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేస్తుందన్నారు. తాము కేవలం తెలుగుదేశం పార్టీని విమర్శించడం లేదని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన, నాటి చంద్రబాబు నాయుడు పాలనను గురించి ప్రజలకు చెబుతున్నామన్నారు.
పంచాయతీ ఎన్నికలలో తమకు ఎవరు పోటీ లేదన్నారు. పార్టీలో ఉన్న కుమ్ములాటలు కుటుంబ సమస్యగానే భావిస్తున్నామన్నారు. వాటిని ఓ కుటుంబ సమస్యగానే పరిష్కరించుకుటంటామన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలోను ఇలాంటి గొడవలు ఉన్నాయన్నారు. ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి మూడో ఫ్రంట్ పైన పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తారన్నారు.
జగన్ అధికారంలోకి వచ్చి 6 నెలల్లో విశాఖ మెడికల్ సైన్సెస్ నిర్మాణాన్ని పూర్తి చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల శనివారం విశాఖపట్నం జిల్లాలో అన్నారు. ఆమె పాదయాత్ర విశాఖలో కొనసాగుతోంది. పామ్‌బీచ్ సమీపంలోని వైయస్ విగ్రహానికి షర్మిల పూలమాలవేసి పాదయాత్ర ప్రారంభించిన షర్మిల వాల్తేర్ మీదుగా రామకృష్ణాపురం వరకు చేశారు.












Click it and Unblock the Notifications