జగన్‌పై అసూయతోనే...: ఉండవల్లిపై అంబటి నిప్పులు

Ambati Rambabu
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. రామోజీరావుపై విమర్శలతో ఉండవల్లి వెలుగులోకి వచ్చారని, ఇప్పుడు రామోజీరావుపై ఎందుకు విమర్శలు చేయడం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

రాజకీయంగా ఉండవల్లి అంతిమ దశలో ఉండబట్టే రామోజీరావుపై గానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై గానీ విమర్శలు చేయడం లేదని ఆయన అన్నారు. జగన్‌పై ఉండవల్లివి దిగజారుడు వ్యాఖ్యలని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కారణమని జగన్ ఎప్పుడూ అనలేదని స్పష్టం చేశారు.

ఉండవల్లి ఓ నమ్మద్రోహి అని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెసు నాయకులు విమర్శిస్తున్నప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం చేశారని ఆయన అడిగారు. ఉండవల్లి దిగజారుడుతనం చూస్తుంటే బాధేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రామోజీరావు విషయంలో ఉండవల్లి అస్త్ర సన్యాసం చేశారా అని ఆయన అడిగారు. రామోజీరావును ఉండవల్లి క్షమాపణలు కోరారా అని ఆయన ప్రశ్నించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి మరణంపై రాష్ట్ర ప్రజలకు ఎన్నో అనుమానాలున్నాయని, వైయస్ మరణానికి సోనియా కారణమని ఎవరన్నారో ఉండవల్లి చెప్పాలని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని హనుమంతరావు, మధు యాష్కీ, సర్వే సత్యనారాయణ, శీలం, పాల్వాయి వంటి కాంగ్రెసు నాయకులు విమర్శిస్తుంటే ఉండవల్లి ఎక్కడున్నారని ఆయన అడిగారు.

ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు వాద్రా ఆస్తుల గురించి చర్చించడానికి ఉండవల్లి సిద్ధంగా ఉన్నారా అని ఆయన అడిగారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు, పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, వివేక్ వ్యాపారాలు చేయడం లేదా అని అడిగారు. వారికి వేల కోట్ల రూపాయలు లేవా అని ప్రశ్నించారు. జగన్ వ్యాపారాలు చేయకూడదా, ఆస్తులు సంపాదించుకోకూడదా అని అంబటి అన్నారు. సిబిఐపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉండవల్లి ఎందుకు ప్రస్తావించలేదని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+