ఇప్పుడేమీ చెప్పను: తెలంగాణ ఇష్యూపై చంద్రబాబు

పేదరికానికి ప్రధాన అడ్డంకి అవినీతేనని, ప్రస్తుతం అవినీతి విచ్చలవిడిగా పేరుకుపోయిందని ఆయన అన్నారు. నేరస్థులు, దోపిడీ దొంగలు రాజకీయాల్లో రావడంతో విలువలు తగ్గిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసమర్థ, అవినీతి పాలన వల్ల దేశం నిర్వీర్యమవుతోందని అన్నారు. రాజకీయాల్లో దోచుకుని దాచుకునేవారు ఎక్కువయ్యారని అన్నారు.
అవినీతి రహిత సమాజం కోసం పాటు పడాల్సిన అవసరం ఉందని, తమ పార్టీ అందుకు కృషి చేస్తుందని చంద్రబాబు చెప్పారు. అవినీతి సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నారని విమర్శించారు. అన్నా హజారే, రాందేవ్ బాబా వంటి వారు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని, అటువంటివారి సంస్థలపై దాడులు చేయిస్తున్నారని ఆయన అన్నారు.
విలువలతో కూడిన సమాజం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ల్యాండ్, మైన్, మద్య మాఫియాలు రాజకీయాల్లో ఎక్కువయ్యాయని అన్నారు. ప్రలోభాలు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన చట్టం తేవాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ సంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని అన్నారు. నేరచరితులకు రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వకుండా చట్టాలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications