తెలంగాణ వేడి: 'కావూరి మారలేదు', జానాతో బొత్స భేటీ

Kavuri Sambasiva Rao
హైదరాబాద్/న్యూఢిల్లీ: విభజన విషయంలో కేంద్ర జౌళీ శాఖ మంత్రి, ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు అభిప్రాయం మారలేదని మంత్రి శైలజానాథ్ గురువారం అన్నారు. విభజనపై జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఎపి భవన్‌లో సీమాంధ్ర నేతలు సమావేశమయ్యారు.

లగడపాటి రాజగోపాల్, శైలజానాథ్, కనుమూరి బాపిరాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్నారు. రాష్ట్ర పార్టీ పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కలిసి తమ వాదనలను వినిపించామన్నారు. ఐక్యంగా ఉంటేనే తెలుగు రాష్ట్రం అభివృద్ధి అన్నారు.

జానా నివాసంలో బొత్స, షబ్బీర్ అలీ

మంత్రి జానా రెడ్డి నివాసంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీ భేటీ అయ్యారు. బొత్స రోడ్డు మ్యాప్‌తో అధిష్టానం వద్దకు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఇరు ప్రాంతాల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. జానా, షబ్బీర్ తదితరుల అభిప్రాయాలు తెలుసుకునేందుకే బొత్స ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడారు.

పిసిసి అధ్యక్షుడిగా బొత్స ఇరు ప్రాంత నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారన్నారు. విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామన్నారు. సీమాంధ్ర నేతలకు అపోహలు, అభద్రతా భావం వద్దన్నారు. వారి ఆస్తులకు, ప్రాణాలకు తాము వాచ్‌డాగ్‌లా ఉంటామన్నారు. బొత్సకు తమ అభిప్రాయ చెప్పానన్నారు. కాగా ఈ రోజు సాయంత్రం బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు ఢిల్లీ వెళ్లనున్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం

విభజన జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. రేపు సమైక్యాంధ్ర బందుకు మద్దతు కూడగట్టేందుకు విద్యార్థి, న్యాయవాది, ఉద్యోగ సంఘాలు పలు చోట్ల ర్యాలీలు నిర్వహించాయి. తాడిపత్రి, ఏలూరుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి వంటా వార్పు నిర్వహించారు. ఉపాధ్యాయ, విద్యార్థి జెఏసిలు విశాఖలో బస్సు యాత్రను ప్రారంభించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+