సీమాంధ్ర బంద్ ప్రశాంతం: కోర్ కమిటీ దిష్టిబొమ్మ దగ్ధం

Samaikyandhra JAC bandh
విజయవాడ/విశాఖ/తిరుపతి: రాష్ట్రాన్ని యథావిధిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం సీమాంధ్ర ప్రాంతంలో బందు ప్రశాంతంగా కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో బంద్‌ను స్వచ్చంధంగా పాటిస్తున్నారు. గుంటూరు, చిత్తూరు, తిరుపతి, కడప, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు.

అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే సుధాకర్ ఇంటిని సమైక్యాంధ్ర జెఏసి ముట్టడించింది. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తిరుపతిలో వస్త్రవ్యాపారాలు ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద, పుట్టపర్తి తదితర ప్రాంతాల్లో విద్యార్థులు, జెఏసి భారీ ర్యాలీ నిర్వహించారు. కదిరిలో జెఏసి రాస్తారోకో నిర్వహించింది. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీ గేటు ఎదుట కోర్ కమిటీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఒంగోలులో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. సీమాంధ్రలోని పలు జిల్లాల్లో డిపోల నుండి బస్సులు బయటకు రాలేదు. డిపోల వద్ద జెఏసి నాయకులు ఆందోళనకు దిగారు. విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్చంధంగా బందులో పాల్గొంటున్నాయి. ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. బందు నేపథ్యంలో ఎస్కెయులో ఈ రోజు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు.

మౌనం వీడాలి: ఎపిఎన్జీవో

ఉద్యోగులు అందరు ఇకనైనా మౌనం వీడి సమైక్యాంధ్ర కోసం ప్రజాప్రతినిధుల పైన ఒత్తిడి తీసుకు రావాలని ఎపిఎన్జీవో సూచించింది. హైదరాబాదులో సీమాంధ్ర ఉద్యోగుల పైన వివక్ష చూపిస్తున్నారని, సూటిపోటి మాటలతో సీమాంధ్ర ఉద్యోగులను వేధిస్తున్నారని మండిపడ్డారు. సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా విధులు బహిష్కరిస్తామని, మెరుపు సమ్మెకు కూడా సిద్ధమన్నారు.

దిగ్విజయ్‌ను కలిసిన సమైక్యాంధ్ర ఐకాస

రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి ఈ రోజు కలిసింది. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+