ప్రియుడే కాలేజీ అమ్మాయిని రేప్ చేసి నిప్పు పెట్టాడు

మంగళవారం సాయంత్రం అమ్మాయిని యువకుడు తన ఇంటికి ఆహ్వానించాడని, ఇంటికి వచ్చిన ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడని, అమ్మాయి ప్రతిఘటించడంతో ఆమెపై కిరోసిన్ పోసి ఆమె ఒంటికి నిప్పు అంటించినట్లు పోలీసులు చెబుతున్నారు.
తీవ్రంగా గాయపడిన అమ్మాయిని మొదట గ్రామంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సఫాయి ఆస్పత్రికి తరలించారు. ఆమె ఒళ్లు 80 శాతం కాలిపోయినట్లు చెబుతున్నారు. తనపై అత్యాచారానికి పాల్పడిన యువకుడి పేరును అమ్మాయి తన వాంగ్మూలంలో పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అతనిపై, అతని బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రేమించిన యువకుడే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతనిపై నమ్మకంతో పిలువగానే అమ్మాయి అతని ఇంటికి వెళ్లిందని, కాలిన గాయాలతో పరుగెత్తకుంటూ ఇంటికి వచ్చిందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications