సమన్వయం: వారిని తొలగిస్తారా, చిరుకు 'ప్రచారమా'?

అందులో కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, చిరంజీవిలు కూడా ఉన్నారు. వారు ఆ తర్వాత కేంద్రమంత్రులయ్యారు. దీంతో వారిని ఉంచాలా? లేక కొనసాగించాలా? అనే అంశంపై యోచిస్తున్నారట. దిగ్విజయ్ శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో, ఆ తర్వాత పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలతో భేటీ అయ్యారు.
కేంద్రమంత్రులుగా ఉన్న చిరు, కావూరిలను ఉంచాలా? లేక తొలగించి వేరే వారిని తీసుకోవాలా? అని వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే అప్పటి ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌కు సన్నిహితులుగా ముద్రపడ్డ వారిని కొనసాగించే విషయంపైనా చర్చ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. కొద్ది రోజుల్లోనే సమన్వయ కమిటీని పునరుద్ధరించే అవకాశాలున్నాయి.
కాగా, 2009 పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు అమలయ్యాయా? లేదా? అన్న అంశాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకునేందుకు ఓ కమిటీని నియమించాలని దిగ్విజయ్ నిర్ణయించారు. మేనిఫెస్టో కమిటీ పేరిట దీనిని ఏర్పాటు చేస్తారు. 2014 ఎన్నికల నేపథ్యంలో ప్రచార కమిటీని నియమించాలని భావిస్తున్నారు.
చిరంజీవి నేతృత్వంలో ఇది ఏర్పాటవుతుందని ఎప్పటి నుంచో ప్రచారం నడుస్తోంది. త్వరలోనే ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications