వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్స గురువును 'ముంచిన' శిష్యుడు: షర్మిల ఎద్దేవా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa is the greatest betrayer: Sharmila
విజయనగరం: ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నేతలకు ద్రోహం చేస్తారని, అందుకు ఆయనకు రాజకీయాల్లో గురువు అయిన సాంబశివ రావు కూడా మినహాయింపు కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల శనివారం ఆరోపించారు. ఆమె పాదయాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె పలుచోట్ల మాట్లాడారు. తనకు రాజకీయ గురువు అయిన సాంబశివ రావుకు కూడా ద్రోహం చేశారని ఆమె ఆరోపించారు.

గురువును మించిన శిష్యుడు అయితే ఏ గురువైనా సంతోషిస్తారని, కానీ బొత్స గురువును ముంచిన శిష్యుడయ్యాడన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు ప్రభుత్వంతో కుమ్మక్కై, కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ఆరోపించారు. ఆ పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారన్నారు.

పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులపై ధరల భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి లేకుంటే బొత్స అనే వ్యక్తే లేరన్నారు. కానీ ఆయన ఇఫ్పుడు ఆయన కుటుంబం పైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ త్వరలో బయటకు వస్తారన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేయాలని, తద్వారా సుపరిపాలన అందుతుందని, ఆ ఓటు జగన్ నిర్దోషిగా చెప్పేందుకు కూడా ఉపయోగపడుతుందన్నారు.

English summary
YSR Congress Party leader Sharmila alleged that PCC chief Botsa Satyanarayana is the greatest betrayer of key leaders, including his own guru Sambasiva Raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X