కన్యత్వాన్ని అమ్మిన విద్యార్థిని, మోసగించారని ఆవేదన

తన కన్యత్వాన్ని ఆన్‌లైన్లో వేలానికి పెట్టింది. తద్వారా వచ్చిన డబ్బులతో నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తానని ప్రకటించింది. జపాన్‌కు చెందిన నట్సు (53) వేలంలో కొన్నాడు. ఏకంగా 7,80,000 డాలర్లు (రూ.4.67 కోట్లు) చెల్లించేందుకు ముందుకొచ్చాడు. దీంతో, ఆమె వ్యభిచారి కంటే హీనమంటూ ఇంటర్నెట్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
అయితే, ఇది వ్యాపారమని, ఓ సినిమాలో నటించే అవకాశంతోపాటు దానికి బోనస్‌గా విదేశాలకు వెళ్లే చాన్స్ కూడా వచ్చిందని, ఓ అద్భుత ఫొటో తీసినంత మాత్రాన ఎవరూ ఫొటోగ్రాఫర్ కాలేరని అలాగే, జీవితంలో ఒకే ఒక్కసారి చేసినంత మాత్రాన వ్యభిచారి కాబోరని, వేలమనేది కేవలం వ్యాపారం మాత్రమేనని వ్యాఖ్యానించింది.
వేలం అనంతరం సిడ్నీలోని ఓ రెస్టారెంట్‌లో నట్సును కలుసుకోవడానికి ఆమె వెళ్లానని అయితే, సినిమా డైరెక్టర్ సిస్లే ఇచ్చిన స్క్రిప్టుకు అక్కడి వాతావరణానికి సంబంధం లేదని ఆమె తెలిపింది. తామిద్దరం శృంగారంలో పాల్గొనలేదని చెప్పింది. సిస్లే ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వలేదని, నట్సు ఇచ్చిన రూ.4.67 కోట్లను కూడా ఇవ్వలేదని అప్పుడు ఆరోపించింది.
అయితే, ఇప్పుడు ఆమె మాట మార్చింది. జస్టిస్ సిస్లే అనే డైరెక్టర్ 'వర్జిన్స్ వాంటెడ్' అనే డాక్యుమెంటరీ తీశారని, దానికి ప్రచారం కల్పించడానికే ఇంత నాటకం ఆడాడని చెబుతోంది. ఇందులో తనను పావుగా వాడుకున్నాడని ఆరోపిస్తోంది. అసలు నట్సు అనే వ్యక్తే లేడని, తన డాక్యుమెంటరీకి ప్రచారం కల్పించుకోవడానికి ఇదో నాటకమని ఆమె వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications