లగడపాటి ఓ జోకర్: పాల్వాయి, కెసిఆర్‌కు విష్ణు ప్రశ్న

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని అడిగినప్పుడు... అన్ని నిధులు ఎక్కడి నుండి తెస్తామని కోర్ కమిటీ ప్రశ్నించిందన్నారు. తెలంగాణ ఇస్తే దేశవ్యాప్తంగా సమస్యలు తలెత్తుతాయన్న సంజీవ రెడ్డి అబిప్రాయానికి అంత విలువ లేదన్నారు. లగడపాటి రాజగోపాల్ కాంట్రాక్టరే తప్ప అసలైన రాజకీయ నాయకుడు కాదన్నారు.
తెలంగాణ ప్రజల మనోభావాలను ప్యాకేజీలతో కొలవడం సరికాదని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని కిరణ్ ప్రతిపాదించినట్లుగా వార్తలు వచ్చాయని, ప్యాకేజీ సరికాదన్నారు. ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుండి రూ.లక్ష కోట్ల ప్యాకేజీ ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు.
అలవాటుగా మారింది: మురళీధర రావు
తెలంగాణపై కాంగ్రెసు నాన్చివేత ధోరణి అవలంభిస్తోందని బిజెపి కార్యదర్శి మురళీధర రావు వేరుగా అన్నారు. తెలుగు ప్రజలను అవమానించడం కాంగ్రెసు పార్టీకి పరిపాటిగా మారిందన్నారు.
గందరగోళం కోసమే: జగదీశ్వర్ రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికలలో గందరగోళం సృష్టించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని తెరాస నేత జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రాంతంలో తెలంగాణకు మద్దతిచ్చిన వారే ఎన్నికల్లో గెలుస్తారన్నారు.
నమ్మొద్దంటే ఎలా?: మల్లాది విష్ణు
పెద్దలు పిలువకుండానే తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేస్తానని ప్రకటించిన కెసిఆర్ ఇప్పుడు తమ పార్టీని నమ్మొద్దంటే ఎలా అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. కోస్తాలో కాంగ్రెసుకు బలం తగ్గిందన్న పాల్వాయి, పొన్నం ప్రభాకర్‌ల పైన తాను అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications