టిడిపితో జగన్ పార్టీ దోస్తీ, 'టి'లో కన్పించని 'జగన్' ఎఫెక్ట్

ఎక్కువ స్థానాలలో కాంగ్రెసు - వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు జతకట్టాయి. కొన్నిచోట్ల కాంగ్రెసు - టిడిపి, టిడిపి - వైయస్సార్ కాంగ్రెసులు జతకట్టాయి. తెలంగాణలో టిఆర్ఎస్, బిజెపిలు కూడా ఇతర పార్టీలతో పలుచోట్ల జతకట్టాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలు. అయినా పార్టీల ప్రభావం కనిపిస్తుంటుంది. కానీ స్థానికవసరాలకు అనుగుణంగా ప్రత్యర్థి పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి.
తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా మూడు ప్రాంతాల్లో కాంగ్రెసు - వైయస్సార్ కాంగ్రెసు దోస్తీ కట్టింది. పలుచోట్ల ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దింపాయి. గుంటూరు జిల్లా సహా పలుచోట్ల వైయస్సార్ కాంగ్రెసు - టిడిపిలు జోడీగా బరిలో నిలుస్తున్నాయి. మెదక్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో టిడిపి - తెరాస కలిసి రంగంలోకి దిగుతున్నాయి.
తెలంగాణలో జగన్ పార్టీ సగానికంటే తక్కువే!
సీమాంధ్రలో సత్తా చాటుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో అంతగా ప్రభావం లేదనే చెప్పవచ్చు. ఆ పార్టీకి చెందిన సానుభూతిపరులు పంచాయతీ ఎన్నికల కోసం దాఖలు చేసిన నామినేషన్ల సంఖ్య తెలంగాణవ్యాప్తంగా నలభై శాతానికి మించలేదట. పలుచోట్ల ఇతర పార్టీలతో అవగాహన కుదుర్చుకున్నప్పటికీ... నామినేషన్ల దాఖలులో సగం కూడా లేకపోవడం గమనార్హం. అయితే సీమాంధ్రలో మాత్రం నామినేషన్లు బాగాన వేశారు.












Click it and Unblock the Notifications