విదేశీ మహిళలపై లైంగికదాడులు పెద్ద మచ్చ: చిరంజీవి

ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు శాంతిభద్రతల పైన దృష్టి సారించాలన్నారు. పర్యాటకులందరికీ స్నేహ పూర్వకమైన వాతావరణం కల్పించాలని, తాను ఇటీవలె ముఖ్యమంత్రులకు లేఖలు రాశానన్నారు. గత దశాబ్దకాలంగా పర్యాటక రంగం అభివృద్ధి సాధిస్తోందన్నారు.
2012లో విదేశీ పర్యాటకుల సంఖ్య 65.80 లక్షలకు చేరిందన్నారు. దేశీయ పర్యాటకుల సంఖ్య 10.27 కోట్లుగా ఉందన్నారు. ప్రపంచ దేశాల కంటే భారత్‌లోనే పర్యాటకరంగ వృద్ధి అధికంగా ఉందన్నారు. అంతర్జాతీయ పర్యాటకరంగంలో మన వాటా 0.64 గా ఉందని, దీనిని పెంచుకోవాల్సి ఉందన్నారు.
దేశంలోని పుణ్యక్షేత్రాలలో సౌకర్యాలు, భద్రత పెంచాల్సి ఉందన్నారు. కార్పోరేట్ సంస్థలు ప్రముఖ పర్యాటక కేంద్రాలు, స్మారకాలను దత్తత తీసుకొని సంరక్షించాలని సూచించారు. కొన్నింటిని దత్తత తీసుకునేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయన్నారు.












Click it and Unblock the Notifications