షర్మిలా! వైయస్ మద్యం ముట్టలేదా?: బొత్స సంచలనం

కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటర్ నుండి పిజి వరకు విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇస్తున్నామన్నారు. ఎస్సీలకు సమానంగా బిసిలకు ఇస్తున్నామన్నారు. నేరుగా విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా విద్యార్థుల బ్యాంకు అకౌంట్లకు అందిస్తున్నామని, దేశంలో నూటికి నూరు శాతం ఇస్తున్నది మన ప్రభుత్వమే అన్నారు. అయినా విజయమ్మ ఫీజు పోరు అంటూ దీక్ష చేయడం విడ్డూరమన్నారు.
జగన్ పార్టీని చూస్తుంటే జాలేస్తోందని, ఆ పార్టీకి ఓ విధానం, కార్యాచరణ లేదని, దశ దిశ లేకుండా వెళ్తోందన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అకాల మృతి చెందితే ఆ సానుభూతితో అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారని, తద్వారా దోచుకోవడానికి - దాచుకోవడానికి చూస్తున్నారని విమర్శించారు. విజయమ్మ నిరాహార దీక్ష స్వలాభం కోసం, యాజమాన్యాల కోసమే అన్నారు. ప్రతిపక్షంలో ఉండి అనవసర రాద్దాంతం చేయడం సరికాదన్నారు.
షర్మిల పాదయాత్ర చేస్తు చిలుకపలుకులు పలుకుతున్నారని, తనను బ్రాందీ వారసులా? గాంధీ వారసులా? అని అడుగుతున్నారని, ఎవరో చెప్పారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. జగన్ పార్టీ ఎందుకు పుట్టిందో అందరికీ తెలుసునన్నారు. జగన్‌ను కేసుల నుండి తప్పించి, జైలు నుండి విడిపించేందుకే ఆ పార్టీ ప్రయత్నాలు అన్నారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం సరికాదన్నారు. కాంగ్రెసు పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి లేదన్నారు.
షర్మీలా! నీ తండ్రి బ్రాందీ ముట్టలేదా అని ప్రశ్నించారు. వైయస్ మద్యం తాగేవారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు నీ భర్త అనిల్ కుమార్‌ను తన వద్దకు ఎందుకు తీసుకు వచ్చావని ప్రశ్నించారు. తన భర్త తప్పులు కప్పిపుచ్చేందుకు అప్పుడు తన వద్దకు తీసుకు వచ్చారన్నారు. జగన్‌ను బయటకు తీసుకు వచ్చేందుకు ఇలాంటి ప్రయత్నాలని ఆయన మండిపడ్డారు.
విజయమ్మ దీక్ష
రెండు రోజుల ఫీజు పోరు దీక్షలో భాగంగా విజయమ్మ ఈ రోజు ఉదయం ఇందిరాపార్కు వద్ద దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. తన దీక్ష యాజమాన్యానికి కొమ్ము కాసేందుకు కాదని, విద్యార్థుల కోసం పోరాటం చేసే పార్టీ తమదన్నారు. ఒక్కో కళాశాలకు ఒక్కో ఫీజు సరికాదన్నారు. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్న ప్రభుత్వ విచిత్ర విన్యాసాలు హాస్యాస్పదమన్నారు.












Click it and Unblock the Notifications