జగన్ పార్టీ జాడ ఎక్కడ?: హరీష్ రావు, బాబుపై ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణపై దాగుడుమూతలు ఆడుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని విమర్శించారు. తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తుంటే, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమైక్యపాట పాడుతున్నారని మండిపడ్డారు.
ఒకవైపు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అడ్డుకాదని టిడిపి నేతలు చెబుతుంటే మరోవైపు సమైక్యవాదంతో కోడెల శివప్రసాద్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటన్నారు. చంద్రబాబు తెలంగాణపై స్పష్టత ఇవ్వకుండా పూటకోమాట మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
సిఎంపై విద్యాసాగర రావు ఫైర్
తెలంగాణ ఇస్తే నక్సలిజం పెరుగుతుందని ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని బిజెపి సీనియర్ నేత విద్యాసాగర్ రావు విమర్శించారు. బుధవారం ఆయన హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు 1951 వరకు సాయుధ పోరాటం చేసి, విరమించుకున్నారన్నారు. అలాంటివారి బలిదానాన్ని అవమానించేలా మాట్లాడినందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications