యాదవ మహాసభ: హైద్రాబాద్‌కు యుపి సిఎం అఖిలేష్

ఇందులో అఖిలేష్ కూడా పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు యాదవ నేతలు కూడా హాజరుకానున్నారు. యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు ఉదయం ప్రతాప్ సింగ్ యాదవ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ గౌర్, ఉత్తర ప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు రానున్నారు.
మన రాష్ట్రానికి చెందిన శాసన మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు రఘువీరా రెడ్డి, పార్థసారథి, పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ శాసన మండలి ఫ్లోర్ లీడర్ యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పాల్గొంటారు.
2014 సాధారణ ఎన్నికలలో యాదవుల పాత్ర పైన వారు చర్చించనున్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యాదవులకు, యాదవ మహిళలకు రాజకీయాల్లో పాత్రపై చర్చించనున్నారు. యాదవ మహిళల రిజర్వేషన్ల పైన చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications